Nagarjuna: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు అక్కినేని నాగార్జున. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇక నాగార్జున కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈయన మొదట దగ్గుబాటి లక్ష్మి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య జన్మించిన తర్వాత ఆమెతో విడాకులు తీసుకొని అనంతరం నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ అనే కుమారుడు కూడా ఉన్నారు.
ప్రస్తుతం నాగార్జున ఇద్దర కుమారులు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జున ఫ్యామిలీ గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన సన్నివేశం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. లక్ష్మీతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్యను తన తల్లితో పంపించాల్సి వచ్చింది నా జీవితంలో అదే అత్యంత బాధాకరమైన విషయం అని తెలిపారు.
చైతన్యను పంపించాల్సి వచ్చింది..
ఇక నాగచైతన్య స్కూల్ స్టడీస్ మొత్తం అయిపోగానే హైదరాబాద్ వచ్చి నాతో ఉన్నారు. అయినప్పటికీ చైతన్య తన చిన్నతనంలో నా వద్ద లేరన్న బాధ నన్ను ఇప్పటికి వెంటాడుతూనే ఉంటుందని నాగార్జున ఈ సందర్భంగా తన కొడుకు నాగచైతన్య గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































