Hero Nikhil: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నిఖిల్ తాజాగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన 18 పేజెస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో నిఖిల్ సినీ కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని అనంతరం ఒక బుల్లితెర సీరియల్స్ లో 40 ఎపిసోడ్స్ వరకు నటించానని తెలిపారు.అయితే ఇక్కడే ఉంటే బుల్లి తెరకే పరిమితమవుతానని ఆలోచించి తాను ఆడిషన్స్ కి వెళ్లడం ప్రారంభించానని తెలిపారు.చాలామంది ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యానని ఫోన్లు కూడా చేశారు. అనంతరం వారు అడ్రస్ లేకుండా పోయారని తెలిపారు.
ఇక చాలామంది హీరోగా అవకాశం కావాలంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి 50 లక్షలు ఇవ్వాలి అంటూ డబ్బు కూడా డిమాండ్ చేశారు. అప్పటికి తాను హీరోగా అవకాశాలు అందుకోవడం కోసం ఐదు లక్షలు ఖర్చు చేశానని అయితే లక్ష రూపాయల వరకు షూటింగ్ జరిగిన తర్వాత ఆ సినిమా కూడా ఆగిపోయిందని తెలిపారు. ఆ తర్వాత వాళ్లు తనని మోసం చేసినట్లు గ్రహించానని నిఖిల్ తెలిపారు.

Hero Nikhil: ఇప్పటికీ ఆ చెక్ భద్రంగా ఉంది…
ఇక హ్యాపీడేస్ సినిమాలో ఆడిషన్స్ జరిగిన తర్వాత ఆ పాత్రకు నేనే కరెక్ట్ గా సెట్ అవుతానని భావించిన శేఖర్ కమ్ముల గారు తనకు ఈ సినిమాలో అవకాశం కల్పించారని ఈ సినిమాకు గాను ఆయన పాతికవేల రూపాయల చెక్ అందించారని తెలిపారు. అదేనా ఫస్ట్ రెమ్యూనరేషన్ చెక్.ఇప్పటికీ ఆ చెక్ డ్రా చేయకుండా అలాగే భద్రంగా పెట్టానని ఈ సందర్భంగా నిఖిల్ ఎదుర్కన్న స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చారు.































