అసలే కరోనా మహమ్మారి వల్ల పూర్తిగా ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్నారు జనం. ఇటువంటి పరిస్థితులకలో కూడా కార్పొరేట్ వైద్యం పేరుతో కొన్ని ఆసుపత్రులు వేస్తున్న బిల్లులు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అసలు ఇటువంటి ఆసుపత్రులపై నియంత్రని లేనట్టుగానే ఉంది పరిస్థితి. తాజగా ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు యంగ్ హీరో. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసాడు హీరో నిఖిల్. కరోనా సమయంలో సోనూ సూద్ అంత కాకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలలో అడిగినవారికి వెంటనే స్పందిస్తూ తన మంచి మనస్సు చాటుకున్నాడు హీరో నిఖిల్.

తాజాగా ఈ ఆస్పత్రి బిల్లులపై స్పందిస్తూ.. ” తాను చాలా మంది పేషెంట్స్ ఆసుపత్రి బిల్స్ చూశానని, వాటిలో చాలా మంది బిల్లులు 10 లక్షల రూపాయలకు పైనే ఉండటం నన్ను ఆశ్చర్యం కలిగించిందని నిఖిల్ పేర్కొన్నారు. పేషెంట్స్ కు బిల్స్ వేయడం విషయంలో కొన్ని ఆసుపత్రి యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ నేపధ్యంలో కొంతమంది ఆసుపత్రి బిల్లులను చెల్లించడంలో తమ బృందం చేతనైనంత సాయం చేస్తున్నట్లు నిఖిల్ తెలిపారు. సాధారణ సర్జరీలకు కూడా మన లోకల్ ఆసుపత్రులు అంతంత బిల్స్ ఎందుకు వేస్తున్నాయి? వీటిని నియంత్రించేది వారు లేరా? అంటూ నిఖిల్ ఆవేదన చెందుతూ ట్వీట్ చేశారు.
Seeing a lot of Hospital Bills in Excess of 10 lakhs.
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 6, 2021
Why r our local hospitals charging such huge amounts for Basic Operations?
We wer helping with Paying a few Patients Bills nd realised tht the entire amount is going to ridiculously charging hospitals.
Who is regulating them?






























