Narne Nithin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి కూడా అందరికీ తెలిసిందే. లక్ష్మీ ప్రణతి తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో మినహా బయట ఎక్కడా కనిపించారు. ఇక సోషల్ మీడియాకి కూడా ఈమె చాలా దూరంగా ఉంటారు. ఇతర స్టార్ హీరోల సెలెబ్రిటీలు తరచూ పలు ఈవెంట్లకు వెళ్లడం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక లక్ష్మీ ప్రణతి మాత్రం ఇలాంటి ఈవెంట్ కు హాజరు కారు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఈమె కేవలం ఫ్యామిలీ ఈవెంట్లకు మాత్రమే హాజరవుతూ ఉంటారు. అందుకే లక్ష్మీ ప్రణతికి సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికి తెలియదు. అయితే తాజాగా లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈయన నటించిన ఆయ్ అనే సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన అక్క గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ ప్రశ్నకు నితిన్ సమాధానం చెబుతూ.. ఒక తమ్ముడిగా మా అక్క ప్రణతితో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది అయితే మా అక్క చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది ఎవరితోనో కలవడానికి పెద్దగా ఇష్టపడదు అంటూ ఆమె మనస్తత్వం గురించి నితిన్ వెల్లడించారు.
ఎవరితోనూ మాట్లాడదు..
ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి గురించి నితిన్ చేసిన ఈ కామెంట్స్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె ఒకసారి అయినా ఎన్టీఆర్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటే చూడాలని ఉంది. ఇప్పటివరకు ఈమె మాటలను కూడా అభిమానులు ఎక్కడ విన్న సందర్భాలు కూడా లేవు. ఇక ఇటీవల ఈమె ఎన్టీఆర్ 31 సినిమా పూజ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.



























