Mega family: మెగా ఇంట్లో ఇటీవల కాలంలో అన్ని శుభవార్తలే వింటున్నారు. మెగా కుటుంబ సభ్యులకు ఇటీవల కాలంలో అంత మంచే జరుగుతుందని చెప్పాలి. అయితే మెగా కుటుంబానికి జరుగుతున్న ఈ మంచిని చూసి మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో మొదలైన ఈ వేడుకలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించడం అలాగే వరుణ్ తేజ్ తన ప్రేమించిన అమ్మాయి నటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మంత్రిగా విజయాలు అందుకోవడం మనం చూస్తున్నాము. ఇలా మెగా కుటుంబానికి అన్ని శుభవార్తలే అని చెప్పాలి.
ఇక త్వరలోనే మెగా ఇంట్లో మరో పండుగ వాతావరణం చోటు చేసుకోబోతుందని తెలుస్తుంది. త్వరలోనే మరో మెగా హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మోస్ట్ బ్యాచిలర్ గా ఉన్నటువంటి మెగా హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
వ్యాపారవేత్త కుమార్తె..
ఇప్పటికే ఈయన కుటుంబ సభ్యులు ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో తనకు పెళ్లి నిశ్చయం చేశారని, అన్ని విషయాలు మాట్లాడుకోవడం పూర్తి అయ్యాయని త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేయబోతున్నారని సమాచారం. ఇలా ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే పెళ్లి కూడా జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే ఈయన పెళ్లికి సంబంధించి అధికారికంగా తెలియజేయబోతున్నట్లు సమాచారం.



























