Nayanatara -Vignesh Shivan: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నయనతార విగ్నేష్ శివన్ జంట ఒకటని చెప్పాలి. నయనతార సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈమె డైరెక్టర్ విగ్నేష్ ప్రేమలో పడి తనతో కొన్ని సంవత్సరాలపాటు రిలేషన్ లో ఉంటూ 2022వ సంవత్సరంలో తనని పెళ్లి చేసుకున్నారు.

ఇలా పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట సరోగసి ద్వారా కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం నయనతార తన వృత్తిపరమైనటువంటి జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలోను అలాగే బిజినెస్ రంగంలో కూడా ఎంతో సక్సెస్ సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే వీరిద్దరూ ఇలా ప్రేమలో పడి నిజ జీవితంలో ఒక్కటి అవ్వడానికి ఒక హీరో కారణమని విగ్నేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విగ్నేష్ దర్శకుడిగా నానుమ్ రౌడీ ధాన్ సినిమా కథ నయనతారకు చెప్పమని ధనుష్ సర్ నాకు సూచించారు. ఈ సినిమా కథ నయనతారకు చెప్పడంతో ఆమెకు ఈ సినిమా కథ నచ్చింది. అప్పటివరకు ఈ సినిమాలో నటించనని చెప్పిన విజయ్ సేతుపతి నయనతార ఓకే చెప్పారు అనగానే వెంటనే సినిమాకు ఓకే చెప్పారు.
ధనుష్ కారణం…
ఇక ఈ సినిమా సమయంలో తాను నయనతారతో కలిసి ఎక్కువ సమయం స్పెండ్ చేశారని ఆ సమయంలోనే మాకు తెలియకుండా ప్రేమలో పడ్డామని విఘ్నేష్ తెలిపారు. ఒక మాటలో చెప్పాలంటే మా ప్రేమకు హీరో ధనుష్ కారణం అంటూ ఈ సందర్భంగా విగ్నేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























