Hero Prabhas: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రభాస్. నటనపరంగా మంచి పేరు సంపాదించుకున్న ఈయన ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. కెరీర్ మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ఈయనకు టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా విపరీతమైన అభిమానం ఉంది.

ప్రభాస్ తొలిసారిగా 2002లో విడుదలైన ఈశ్వర్ సినిమాతో పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా కాస్త యావరేజ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర సినిమా కూడా అంత సక్సెస్ కాలేకపోయింది. త్రిష తో నటించిన వర్షం సినిమా మాత్రం మంచి హిట్ ని అందించింది. ఆ తర్వాత మరో రెండు మూడు సినిమాల్లో నటించగా ఆ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
అయితే అప్పటికే సక్సెస్ అయిన సినిమాలు అయిన వాళ్ళ కాలేవు అని.. కేవలం హీరోయిన్స్ వల్ల, సినిమా పాటల వల్ల ఆయన సక్సెస్ లిస్టులో పడ్డాడు అని.. విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా కూడా అన్ని ఎదుర్కొని ఆ తర్వాత చత్రపతి సినిమాలో మాస్ హీరోగా నటించిన బాగా కష్టపడి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత మరింత కష్టపడితో మంచి మంచి సినిమాలు ఎంచుకుంటూ స్టార్ లిస్టులో పడ్డాడు.

Hero Prabhas:
ఇక బాహుబలి సినిమా వచ్చాక.. ఆయన క్రేజ్ రాజమౌళి వల్లే పెరిగింది అని చాలామంది అన్నారు. కానీ ఆ తర్వాత అందులో ప్రభాస్ కష్టం కూడా ఉందని తెలిసింది. దీంతో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు. వరుస అవకాశాలు అందుకున్నాడు. కేవలం టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆయన కోసం క్యూ కడుతున్నారు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.































