Hero Rajasekhar:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ గురించి మనకు తెలిసిందే ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే ఇండస్ట్రీలో దర్శకులకు హీరోలకు మధ్య కొన్ని మాటపట్టింపులు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే హీరో రాజశేఖర్ కు డైరెక్టర్ నిమ్మల శంకర్ కిమధ్య కూడా అలాంటి గొడవ చోటు చేసుకుందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలోనే డైరెక్టర్ శంకర్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని అసలు విషయం బయట పెట్టారు.డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆయుధం.ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే ప్రశ్న తనకు ఎదురుకాగా అలాంటి అభిప్రాయబేధాలు మా మధ్య ఏమీ లేవని డైరెక్టర్ తెలియజేశారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ గురించి మాట్లాడుతూ ఆయన సినిమా షూటింగ్ మొదట్లో సరైన సమయానికి లొకేషన్ కి వచ్చే వారని ఆ తరువాత చాలా ఆలస్యంగా రావడం కొన్నిసార్లు టైంకి షూటింగ్ లొకేషన్ కి వచ్చే వారు కాదని శంకర్ తెలియజేశారు.ఆ టైంలో అతనితో మాట్లాడి నేను ఒకటే చెప్పాను మీరు ఏ టైంకి షూటింగ్ వస్తారో చెప్పండి నేను అదే టైంకి షూటింగ్ ప్లాన్ చేసుకుంటానని రాజశేఖర్ తో చెప్పినట్లు డైరెక్టర్ తెలియజేశారు.
ఆరోజు మొత్తం నిద్రపోలేదు…
మీరు ఉదయం 10 గంటలకు వస్తే ఆ సీన్ మొత్తం ఎంతో క్లారిటీగా తీస్తానని మీరు ఆలస్యంగా వస్తే సీన్ కూడా అలాగే ఉంటుందని అతనితో చెప్పాను. ఇలా మా ఇద్దరి మధ్య ఈ సంఘటన చోటు చేసుకోవడం వల్ల ఇద్దరికీ అభిప్రాయభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి కానీ మేమిద్దరం చాలా మంచిగా ఉండేవాళ్లమని తెలిపారు. ఈ క్రమంలోనే ఓ సన్నివేశం షూటింగ్ సమయంలో ఐదున్నరకు హీరో రైలు పై ఉండే షాట్ తీయాలి ఇప్పుడు లొకేషన్లు అయితే అది మొత్తం నా చేతుల్లోనే ఉంటుంది. కానీ ట్రైన్ నా చేతిలో ఉండదు కదా కచ్చితంగా మీరు రావాలని ఒక రోజు రాజశేఖర్ కి చెప్పినప్పుడు ఆ మాట విన్న అతను అయితే నేను ఈ రోజు మొత్తం నిద్ర పోకూడదు అని చెప్పి అలా నిద్రపోకుండా కరెక్ట్ టైంకి షూటింగ్ పూర్తి చేశారని శంకర్ తెలియజేశారు.
































