Hero Sai Dharam Tej : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ది డిఫరెంట్ స్టైల్ అనొచ్చు. మామ చిరంజీవి లాగానే వేసే డాన్సులో గ్రేస్ ఉంటుంది ఈ మెగా మేనల్లుడికి. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఎవరూ ఊహించని పరిణామం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్, ముందు చిన్నదే అనుకున్నా తర్వాత అది ఎంత పెద్ద ప్రమాదం అనేది అందరికీ అర్థమైంది. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ హీరోగా మన ముందుకు వస్తాడా అని అందరూ అనుకున్నా చివరకు మళ్ళీ హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయి ధరమ్. తాజాగా తాను నటించిన ‘విరూపాక్ష’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సాయి తన ఆక్సిడెంట్ అలాగే మళ్ళీ కోలుకోవడం, మెగా ఫ్యామిలీ వంటి పలు అంశాల మీద మాట్లాడారు.

ఆక్సిడెంట్ కి కారణం అదే… నా బ్యాంకు బాలన్స్…
సాయి ధరమ్ తేజ్ బైక్ వెళ్తూ ఆక్సిడెంట్ కి గురైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాను ఓవర్ స్పీడ్ వెళ్ళలేదని కాకపోతే రోడ్డు మీద ఇసుక ఉండటంతో బాలన్స్ తప్పి కింద పడ్డానని తెలిపారు. ఆక్సిడెంట్ తరువాతే లైఫ్ లో బాలన్స్ ఉండాలని అర్థమైంది, మాటలే కాదు మనం బైక్ మీద కూడా బాలన్స్డ్ గా ఉండాలని అర్థమైంది అంటూ తెలిపారు. ఇక బ్యాంకు బ్యాలన్స్ బాగుండాలి అంటూ చెప్తూ తన బ్యాంకు బ్యాలన్స్ తనను అభిమానించే లక్షల మంది అభిమానులు అంటూ చెప్పారు.

ఇక తన కుటుంబం మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ పెద మావయ్య చిరంజీవి గారు ఎపుడూ చెప్పే మాట నవ్వు నవ్వించు అని. నువ్వు నవ్వుతూ ఉండు ఎదుటివారిని నవ్విస్తూ ఉండు అని చెబుతారంటూ చెప్పాడు సాయి. ఇక నాగబాబు మావయ్య ఎపుడు నవ్వుతూనే ఉంటాడని ఇక కళ్యాణ్ మావయ్య దగ్గర నిజాయితీగా నిబద్ధతతో ఉండటం నేర్చుకున్నానని చెప్పారు సాయి ధరమ్ తేజ్.
































