Hero Tarun -Mahesh Babu: మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విజయం అనంతరం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాని చేయనున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటేనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఖలేజా అతడు సినిమాలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే సినిమాలో కీలకపాత్ర ఉంటే ఇతర హీరో హీరోయిన్లను తీసుకోవడం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉండటంతో ఈ పాత్రలో నటించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకప్పటి ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు తరుణ్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు సినిమాతో తరుణ్ ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Hero Tarun -Mahesh Babu: సంతోషంలో తరుణ్ ఫాన్స్…
ఈ విధంగా మహేష్ బాబు సినిమా ద్వారా తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియడంతో తరుణ్ అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ విషయం గురించి ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసేవరకు వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.





























