Hero Tarun: టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటి రోజా రమణి వారసుడైన తరుణ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదికి పైగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.

ఆ తర్వాత హీరోగా మారి నువ్వే కావాలి సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఇక అప్పటినుండి తరుణ్ ప్రేమ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన తరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.
ఇదిలా ఉండగా ఇప్పటివరకు తరుణ్ వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే జీవితాన్ని గడుపుతున్నాడు దీంతో తరుణ్ వివాహం గురించి తరచూ అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తరుణ్ తల్లి రోజా రమణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తరుణ్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Hero Tarun: త్వరలోనే పెళ్లి జరుగుతుంది…
ఈ ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ
“తరుణ్ గురించి వస్తున్న రూమర్స్ వల్ల చాలా బాధ కలుగుతుందని తెలిపింది. అంతేకాకుండా తరుణ్ హీరోగా మళ్లీ ఇండస్ట్రీలో ఇవ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తరుణ్ సినిమాతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నాడని తెలిపింది. తరుణ్ ని వెండితెరపై మళ్ళీ చూడాలని ఆశగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ క్రమంలో తరుణ్ వివాహం గురించి మాట్లాడుతూ తరుణ్ వివాహం జరిగితే చాలని, అయితే తొందరలోనే అది కూడా జరుగుతుందని రోజా రమణి తెలిపింది.