Hero Venkatesh: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నారప్ప సినిమా ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళ్ లో ఈ సినిమాను ధనుష్ చేశాడు. అసురన్ సినిమాకు రిమేక్ గా నారప్ప సినిమా తెలుగులో విడుదలైంది. కరోనా పాండమిక్ వల్ల ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేకపోయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థలో ఈ సినిమా విడుదల చేశారు.

డిసెంబర్ 13వ తేదిన వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. వెంకీ అభిమానుల కోరిక మేరకు సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను ఆయన పుట్టినరోజు నాడు మాత్రమే థియేటర్లలో ఉంచనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమాను ఆ రోజు విడుదల చేయనున్నారు. అయితే ఆ ఒక్క రోజు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో ఉంటుంది.
తాజాగా నారప్ప సినిమా నిర్మాత అయిన సురేష్ బాబు ఈ సినిమా గురించి చెప్పడానికి మీడియా సమావేశం నిర్వహించారు. రామానాయుడు స్టూడియోలో వెంకటేష్ అభిమానులతో కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో వెంకీతో సెల్పీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. వెంకటేష్ మాత్రం అక్కడికి వచ్చిన అందరితో ఫోటోలు దిగారు. అయితే వెంకటేస్ ఆ సమయంలో చేతికి థంబ్ స్ల్పింట్ తో ఉండటం చూసి ఫ్యాన్స్ చేతికి ఏమైందంటూ ఆందోళన చెందారు.

Hero Venkatesh…
అభిమానులకు ఆ తర్వాత వెంకటేస్ వివరణ ఇచ్చారు. తాను జిమ్ చేస్తుండగా బొటనవేలు బెణికిందని, అయితే పెద్దగా ప్రమాదమేమీ లేదని తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ కథనాయకుడిగా నారప్ప సినిమా తర్వాత ‘దృశ్యం 2’ కూడా చేశాడు. అయితే అది కూడా ఓటీటీలోనే విడుదలైంది. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ తో ప్రేక్షకులను వెంకీ అలరించారు. ఈ మధ్యనే విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ లో కనిపించారు. ప్రస్తుతం ఆయన హిందీలో సల్మాన్ ఖాన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఆయన చేస్తున్న కొత్త సినిమాను వెంకీ ప్రకటించనున్నారు.
































