సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే.. ఎంతో కొంత బ్యాగ్ గ్రౌండ్ ఉండి ఉండాలి . లేదంటే విపరీతమైన ట్యాలెంట్ ఉండాలి. ట్యాలెంట్ ఉన్నా పరిశ్రమలో తొక్కేసేవారు చాలామంది ఉన్నారు. ఇలా తన టాలెంట్ పై నమ్మకంతో సినీ పరిశ్రమలో తన కంటూ మంచి పేరు తెచ్చుకున్నారు విశ్వక్ సేన్.

అతడు హీరోగా నటించిన కొన్ని సినిమాలు అయినా.. తనకంటూ ఓ ట్రెండ్ ను సెట్ చేసుకున్నాడు.
విభిన్నమైన కథలు, మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలు చేసే విశ్వక్ ఈసారి మరో పెద్ద ప్రయోగంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అందులో అమర ప్రేమికుడిగా నటించిన విశ్వక్.. తదుపరి చిత్రంలో పూర్తిగా భిన్నమైన కథాంశాంతో ముందుకు రాబోతున్నాడు. పూర్తి ఆధ్యాత్మికతతో కూడుకున్న చిత్రం ఇది. దీని గురించి ఓ అప్ డేట్ వచ్చింది. ఆ ప్రాజెక్టు టైటిల్ అనౌన్స్ చేశారు ఈ మూవీ మేకర్స్.
అతడు ఇందులో ఓ విచిత్రమైన మానసిక వ్యాధితో బాధపడుతుంటాడు. శంకర్ అనే పాత్రలో అఘోరాగా కనిపించనున్నాడు. ఈ చిత్రం వీ సెల్యూలాయిడ్ సమర్పణలో విడుదల కానుంది. దీనిలో హీరోయిన్ గా చాందిని చౌదరి నటిస్తోంది. ఈ సినిమాను కాగిత విద్యాధర్ దర్శకుడిగా తెరకెక్కించనున్నారు. కార్తిక్ శబరీష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ రోజు ఈ సినిమా టైటిల్ ను ‘గామి’గా ఖారారు చేశారు. దీనికి సంబంధించి టీజర్ ను కూడా విడుదల చేశారు.






























