Heroine Amani : జంబలకిడి పంబ సినిమతో హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన ఆమని ఆ తరువాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి నటించేందుకు స్కోప్ ఉన్న పాత్రలతో ఒదిగిపోయి నటించి సగటు తెలుగింటి మహిళగా అందరి మదిలో నిలిచిపోయింది. హీరోయిన్ గా దాదాపు అందరు హీరోలతో నటించిన ఆమని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఆ నలుగురు’ సినిమాలో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తున్నారు. తన పాత సినిమా విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రోజా అలా ఉంటుంది…
90 దశకంలో హీరోయిన్స్ అందరితోనూ ఫ్రెండ్షిప్ ఉందంటూ చెప్పిన ఆమని సౌందర్య తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. ఇక సౌందర్య కాకుండా హీరోయిన్ రాధిక చెల్లి నిరోషా, రోజా, ఇంద్రజ, మీనా వీళ్లంతా మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పారు. రోజా అయితే అప్పటికంటే ఇప్పుడు బాగా క్లోజ్ అని అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటుందని, జబర్దస్త్ లాంటి షోస్ లో తరచూ కలవడం వల్ల ఇద్దరం మరింత మంచి స్నేహితులం అయ్యామని చెప్పారు ఆమని. తాను ఎమ్మెల్యే, మినిస్టర్ అయినా కూడా ఆ గర్వం తనలో ఏమాత్రం ఉండదు.

ముందు సినిమాలు చేసేటపుడు ఎలా ఉంటుందో అలానే ఇప్పుడు ఉంది అంటూ చెప్పారు. ఇక తాను నటించిన సినిమాల్లో మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం సినిమాలకు హీరోయిన్ గా నంది అవార్డు అందుకోగా ఇక ‘శుభ లగ్నం’, ‘ఆ నలుగురు’ సినిమాలకు నంది అవార్డు రావడం జరిగిందని వివరించారు. ఇక ఆ నలుగురు సినిమాకు నంది అవార్డు వచ్చినపుడు ఫంక్షన్స్ చేయగా అందులో నేను పాల్గొనలేక పోయాను. అపుడు మోహన్ బాబు గారు ఫోన్ చేసి ఇలాంటి ఫంక్షన్స్ ఎవరైనా మిస్ చేస్తారా అని తిట్టారు అంటూ చెప్పారు ఆమని.































