సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలై తర్వాతే ఓటీటీకి వస్తుంటాయి. కానీ తాజాగా ఓటీటీలో సక్సెస్‌ఫుల్ అయిన సినిమా ఇప్పుడు రివర్స్ గేర్ వేసింది – అంటే థియేటర్లలో విడుదలవుతోంది! ఆ సినిమా ఇంకేం కాదు – అక్కినేని సుమంత్ నటించిన “అనగనగా”.

ఈ సినిమా ఇటీవలే ETV Win వేదికగా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కుటుంబ విలువలు, తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లల చదువుపై ఎంతో హృదయాన్ని తాకేలా చూపించడంతో ప్రతి వర్గానికీ కనెక్ట్ అయింది.
సుమంత్ నటనకు మళ్ళీ ప్రశంసలు
అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ కెరీర్‌పై ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ప్రేమకథ (1999), సత్యం, గోదావరి, మళ్ళీ రావా, సీతా రామం వంటి సినిమాల్లో నటనతో ఆకట్టుకున్న సుమంత్, తాజాగా “అనగనగా”లో “వ్యాస్” పాత్రలో మరోసారి తన నటనా ప్రతిభను చాటాడు. ఈ పాత్రలో అతని భావోద్వేగ ప్రదర్శనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

హీరోయిన్ కాజల్ చౌదరి – స్క్రీన్ మీద పద్ధతిగా, స్క్రీన్ బయట గ్లామరస్‌గా!
ఈ సినిమాలో స్కూల్ ప్రిన్సిపాల్‌గా, సుమంత్ భార్యగా మరియు తల్లిగా నటించిన కాజల్ చౌదరి ప్రేక్షకులను తన సహజ నటనతో ఆకట్టుకుంది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ నటి “అనగనగా” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
అయితే సినిమాలో ఎంతో సీరియస్, సంప్రదాయబద్ధంగా కనిపించిన ఆమె… సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె పంచిన స్టైలిష్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మళ్ళీ థియేటర్లలోకి అడుగుపెడుతున్న అనగనగా!
ఓటీటీలో విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి రావడం విశేషం. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్‌కు నాంది కావొచ్చు. ప్రేక్షకులు థియేటర్లో ఈ ఎమోషనల్ కథను ఎలా స్వీకరిస్తారో చూడాలి మరి!
































