Kriti shetty: ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తెలుగులో అనంతరం వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి ఇక ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు పడటంతో ఈమె క్రేజ్ తెలుగులో భారీగా పెరిగిపోయింది. అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ సినిమాల తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

ఈ విధంగా కృతి శెట్టి నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత విరామం తీసుకున్నటువంటి ఈమె తిరిగి వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక త్వరలోనే శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనమే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ ఏడో తేదీ విడుదల కానుంది.
ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఈమెకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నారా? అనే ప్రశ్న ఎదురవగా అవును తాను రిలేషన్ లో ఉన్నాను అంటూ ఈమె షాకింగ్ సమాధానం చెప్పారు..
నా ప్రొఫెషన్..
ఎవరితో రిలేషన్ లో ఉన్నారని ప్రశ్నించడంతో నా ప్రొఫెషన్ తో..నా వర్క్ తో నేను రిలేషన్ లో ఉన్నానని కృతి శెట్టి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో ఈమె మెగా హీరోతో రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండించినటువంటి ఈమె తాజాగా రిలేషన్షిప్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



























