Sreeleela: శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు ఈమె పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అనంతరం ధమాఖ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.

ఇక ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది ఇకపోతే తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్వహిస్తున్నటువంటి ఒరిజినల్ అనే కార్యక్రమానికి శ్రీ లీల మొదటి గెస్ట్ గా హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమానికి సౌమ్య యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సౌమ్య శ్రీ లీలను పలు రకాల ప్రశ్నలు వేశారు .అయితే తాజాగా తనకు కాబోయే వ్యక్తి గురించి కూడా ప్రశ్నలు వేశారు కాబోయే వ్యక్తి మిమ్మల్ని బాగా నవ్వించే వ్యక్తి అయి ఉండాల లేక బ్రెయిన్ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శ్రీ లీల ఆసక్తికర సమాధానం చెప్పారు.
నన్ను నవ్విస్తే చాలు..
తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి బ్రెయిన్ లేకపోయినా పర్వాలేదు ఆయన బ్రెయిన్ తో చేసే పనులు అన్నింటిని నేను చూసుకుంటాను కానీ తను మాత్రం ఎప్పుడు సరదాగా నన్ను నవ్విస్తూ జోవియల్ గా ఉండాలి అంటూ ఈమె చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ కామెంట్స్ విన్నటువంటి అభిమానులు అలాగైతే నువ్వు జోకర్ ను పెళ్లి చేసుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.


































