పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన .. సెలబ్రిటీలు వీళ్లే!

0
2517

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత గర్భవతి కావడం పిల్లల్ని కనడం ఒక ఆచారంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తోంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ ఆచారాలను బ్రేక్ చేస్తూ ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లికి ముందే కొందరు గర్భం దాల్చగా మరికొందరు పిల్లల్ని కన్న తర్వాత పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పిల్లల్ని కన్నారు.

అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి నుంచి మొదలుకొని క్రికెటర్ హార్దిక్ పాండే గర్ల్ ఫ్రెండ్ నటాషా వరకు కొందరు సెలబ్రిటీలు పెళ్లికి ముందే గర్భం దాల్చారు. మరి కొందరు పిల్లల్ని కూడా కన్నారు. మరి పెళ్లికి ముందే గర్భం దాల్చి, పిల్లల్ని కన్న సెలబ్రిటీలు ఎవరు ఇక్కడ తెలుసుకుందాం..

శ్రీదేవి బోనీ కపూర్ ను పెళ్లి చేసుకునే సమయంలో 7 నెలల గర్భవతి. పెళ్లి చేసుకున్న మూడు నెలలకే జాన్వికపూర్ జన్మించారు.

క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న నటాషా స్టాన్‌కోవిచ్ పెళ్లికి ముందే గర్భం దాల్చారు.

నేహ దుపియా: మాజీ మిస్ ఇండియాగా పేరు సంపాదించిన నేహా.. అంగద్ దుపియాను పెళ్లి చేసుకునేకంటే ముందే వీరిద్దరు రిలేషన్ షిప్‌లో ఉండి పెళ్లి సమయానికి పండంటి కూతురుకు జన్మనిచ్చారు.

అమృతా అరోరా: షకీల్ లడక్‌తో పెళ్లికి ముందే సహజీవనం చేస్తున్న అమృత గర్భవతి అయింది. ఈమె గర్భవతి అని తెలిసిన కొన్ని నెలలకే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

అమీ జాక్సన్: అమీ జాక్సన్ బాయ్ ఫ్రెండ్ జార్జ్‌తో నిశ్చితార్థం అయిన వెంటనే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం అమీజాక్సన్ ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

నీనా గుప్తా: వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయ్యారు. అయితే రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోయినప్పటికీ ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

సారిక: కమల్ హాసన్, సారికకు పెళ్లి కాకుండానే శ్రుతిహాసన్ జన్మించారు.శృతిహాసన్ పుట్టిన రెండు సంవత్సరాలకు వీరిద్దరి పెళ్లి జరిగింది.

రేణు దేశాయ్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెళ్లి కాకుండానే పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేశారు. అకీరానందన్ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.