హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన ‘హరిహర వీరమల్లు’ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓపెన్‌గా స్పందించారు. కొంతమంది ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారని, కానీ తనకు అలాంటి బెదిరింపుల వల్ల ఏమీ పోయేది లేదని స్పష్టంగా తెలిపారు. “ఇది ఏమైనా క్విట్ ఇండియా ఉద్యమమా? ఏం చేస్తారో చేసుకోండి” అంటూ తాను స్పందించానని చెప్పారు.

“బాయ్‌కాట్ చేస్తామంటే నేను ఎదిగాననే అర్థం”
నెల్లూరులోని ఓ చిన్న వీధిలో పెరిగిన తాను ఇంతటి స్థాయికి రావడం అంటే ఎంతో గొప్ప విషయమని భావిస్తున్నట్టు వెల్లడించారు. “నన్ను బాయ్‌కాట్ చేస్తామంటే, వాళ్లే చెబుతున్నారు నేను ఎంతస్థాయికి ఎదిగానో,” అంటూ చురకలంటించారు పవన్.
ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నాను అంటే అది నా అభిమానులు ఇచ్చిన బలమే కారణం..
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 24, 2025
– #HariHaraVeeraMallu సక్సెస్ మీట్ లో @PawanKalyan గారు. pic.twitter.com/vWaC09WQB6
తాను జీవితంలో ఎన్నో దెబ్బలు చూసానని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కాదన్నారు. అభిమానుల ప్రేమే తన బలం అని, వారిచ్చే ధైర్యమే తనను ఇంతదూరం తీసుకువచ్చిందని తెలిపారు. “డిప్రెషన్ ఎంటో నాకు తెలీదు. మనం బలంగా ఉన్నప్పుడు కొందరు నెగిటివ్‌గా మాట్లాడతారు. అది సహజం” అని పేర్కొన్నారు.
Adorable moment at the #HHVM meet.#HariHaraVeerMallu #Pawanakalyan pic.twitter.com/BEsVgzvhGe
— Volganews (@Volganews_) July 24, 2025
సినిమా విజయం, ప్రమోషన్లపై స్పష్టత
ప్రెస్ మీట్‌లో పవన్ సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొనని తాను, ఈ సినిమా విషయంలో ఎందుకు ప్రమోషన్ చేశానో అందరికీ అర్థమయ్యేలా వివరించారు.
‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షోల నుంచే మంచి వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు దాదాపు రూ.50 కోట్ల షేర్ వచ్చినట్లు అంచనా. పాజిటివ్ టాక్ కొనసాగుతుండటంతో, ఈ విజయం నేపథ్యంలో చిత్రబృందం ఈ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.































