Himaja: హిమజ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర నటి పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా బిజీగా గడుపుతున్నారు. ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే కాకుండా తనకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె కొత్త ఇల్లు కట్టబోతున్నానంటూ తన కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఇంటిని కూడా చూపించిన విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈమె తన కొత్త ఇంట్లోకి ప్రవేశించారని తెలుస్తోంది. ఈ క్రమంలోని నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను హిమజ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇందులో ఈమె పట్టు పరికిణి ధరించి తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు.ఇలా పట్టు పరికిణిలో లక్ష్మీదేవి ఫోటోని చేతపట్టి ఈమె గృహప్రవేశం చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ తనకు తానే శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Himaja: జ్ఞాపకాలను పదిలపర్చుకోవడం…
కొత్త ఇల్లు నిర్మించుకోవడం అంటే మన కలలను నెరవేర్చుకోవడం…జ్ఞాపకాలను పదిలపరుచుకోవడం… నాకు నేనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
‘
View this post on Instagram































