Himaja: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం విడాకులు సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలోనే ఎన్నో జంటలు ఒకరిని చూసుకొని మరొకరు చిన్న చిన్న మనస్పర్థలకు విడాకులు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోని టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకులు తీసుకోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య ధనుష్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు.

ఇలా ఈ రెండు జంటల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొక జంట కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమైందని వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇంతకీ ఆ జంట ఎవరు అనే విషయానికి వస్తే బుల్లితెర సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న నటి హిమజ.

ఇలా బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే ఇప్పటి వరకు ఈమె ఎన్నో వీడియోలను షేర్ చేసినప్పటికీ ఎక్కడా కూడా తనకు పెళ్లి అయిన విషయాన్ని తన పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్త వైరల్ అయింది.
రెండవ భర్తకి విడాకులు…
నటి హిమజ 2012వ సంవత్సరంలోనే ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ ఆనంద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని అయితే అతనితో మనస్పర్ధలు రావడం వల్ల అతనికి విడాకులు ఇచ్చిన హిమజ చల్ల విజయ్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అతనితో విభేదాలు రావడం వల్ల ఇతనికి కూడా విడాకులు ఇస్తుందని వార్తలు రావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వార్తల పై స్పందిస్తూ అసలు హిమజకి పెళ్లి ఎప్పుడు అయింది అంటూ పెద్ద ఎత్తున ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలంటే హిమాజ స్పందించాల్సి ఉంది.































