Kalki: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న తెలిసిందే. ఇటీవల సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి,రాజాసాబ్,స్పిరిట్, సలార్ 2 వంటి సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల చిత్ర యూనిట్ ప్రభాస్ అండ్ దిశా పై ఇటలీలో ఒక అందమైన సాంగ్ ని చిత్రీకరించారు. భారీ చిత్రం రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. టాప్ టెక్నీషియన్ లు ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది మే 9న రిలీజ్ చేసేందుకు సినిమాను షెడ్యూల్ చేశారు.
ఇక ఇప్పటికే ఈ తెలుగు చిత్రాల సత్తాపై హాలీవుడ్ డైరెక్టర్లు స్పందిస్తున్న విషయం తెలిసిందే. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ పై హాలీవుడ్ దర్శకులు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పై క్రిస్టోఫర్ నోలన్ వంటి ప్రముఖ దర్శకుడు స్పందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన తమ్ముడు జోనాథన్ నోలన్ టాలీవుడ్ లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న కల్కి 2898 ఏడీ చిత్రంపై స్పందించారు.
సలహా తీసుకునే స్థాయిలో వారు లేరు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాల్లో లోకేషన్స్, స్టంట్స్ అద్భుతంగా ఉంటున్నాయి. సైన్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ మేకర్స్ మాత్రం ప్రాక్టికల్ గా వర్క్ చేస్తున్నారు. మేకర్స్ ఎవరి సలహా తీసుకునే స్థాయిలో వారు లేరు. మంచి సినిమాను అందించబోతున్నారని ఆశిస్తున్నారు. ఇండియన్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు గొప్పగా సినిమాలు చేస్తున్నారని, ప్రతి సన్నివేశాన్ని అర్థవంతంగా చూపిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



























