చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే జలుబు, దగ్గు తల్లి దండ్రులకు పెద్ద సమస్యగా ఉంటుంది. ఆ సమయంలో పిల్లలు తినకుండా చాలా ఇబ్బంది పెడతారు మరియు శ్వాస తీసుకోవడానికి కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. జలుబు అయితే కొన్ని సార్లు ముక్కు దిబ్బడ పట్టేసి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది, మరికొన్ని సార్లు నీరులా ముక్కు వెంబటి కారుతూనే ఉంటుంది. జలుబు వల్ల కఫం చేరిపోయి దగ్గు మొదలవుతుంది. ఈ రెండిటితో పిల్లలు ఒక్కోసారి ఏడుస్తూనే ఉంటారు.

చిన్న పిల్లల్లో వచ్చే ఈ సమస్యలకు కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకుందాం…

  1. ఒక సంవత్సరం లోపు పిల్లలకు అయితే ఒక పది తులసి ఆకులను బాగా దంచి రసం తీసి దానిలో కొద్దిగా తేనె, పసుపు వేసి బాగా కలిపి అయిదు, ఆరు చుక్కలు పొద్దున్నే పరగడుపున వేస్తుంటే దగ్గు జలుబు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అదే 2 నుండి అపైన వయస్సు వున్న పిల్లలో కొద్దిగ ఎక్కువ మోతాదు ఇచ్చిన పర్వాలేదు..దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా తులసి ఆకులలో ఆరోగ్యానికి కావలసిన చాలా ఔషధగుణాలు ఉన్నాయని అనేక శాస్త్రాలు చెబుతన్నాయి. అలా కానీ పక్షంలో ఒక గ్లాస్ నీటిలో పది తులసి ఆకులు, చిటికెడు పసుపు వేసి సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఆ నీరు చల్లారాక అందులో కొద్దిగా తేనె కలిపి తాగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
  2. దగ్గు వలన పిల్లలకు ఊపిరితిత్తుల్లో బాగా కఫం చేరిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక తమలపాకు తీసుకొని దానికి కొబ్బరి నూనె నీ రెండు వైపులా రాసి పెనం మీద పెట్టీ కొద్దిగ వేడి చేసి రాత్రి పిల్లలు పడుకున్నాక ఛాతీ మీద వేయాలి. మరీ ఎక్కువ వేడి చేయకండి జస్ట్ లైట్ గా మాత్రమే వేడి చేయాలి. ఇలా తరచూ వేస్తుంటే కఫం కరిగి దగ్గు తగ్గిపోతుంది.

ఇలాంటి వంటింటి చిట్కాలు ఉపయోగించి మీ పిల్లలకు అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here