కార్లు కొనేవాళ్లకు బంపర్ ఆఫర్.. ఏకంగా రెండున్నర లక్షలు తగ్గింపు..?

0
91

2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల కార్ల విక్రయాలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ కార్ల కంపెనీలు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కార్ల ధరలను భారీగా పెంచేశాయి. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కారు కొనుగోలు కోసం గతంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన హోండా కార్స్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

హోండా కార్ మోడళ్లపై కంపెనీ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కార్లను కొనుగోలు చేసే వాళ్లు సివిక్ డీజిల్ కారు కొనుగోలుపై ఏకంగా రెండున్నర లక్షల రూపాయల బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. హోండా డీలర్ షిప్స్ ద్వారా తగ్గింపు ధరకే కొత్తకారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం ఉంటుందని సమాచారం. సివిల్ డీజిల్ కారుతో పాటు సివిక్ పెట్రోల్ కారుపై కూడా హోండా ఆఫర్లను అందిస్తోంది.

సివిక్ పెట్రోల్ కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. హొండా కంపెనీ పలు కార్లపై డిస్కౌంట్లను ప్రకటించగా కొన్ని కార్లపై మాత్రం ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఇస్తూఉండటం గమనార్హం. హోండా అమేజ్ కారు కొనుగోలుపై 15,000 రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా 10,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ రూపంలో డిస్కౌంట్ లభిస్తోంది.

కొత్త కార్ల కొనుగోలుపై హోండా సాధారణంగా ఉండే వారంటీ కంటే అదనంగా వారంటీ బెనిఫిట్ ను అందిస్తూ ఉండటం గమనార్హం. హోండా జాజ్ పెట్రోల్ వేరియంట్ మోడల్ కారుపై 15,000 రూపాయల డిస్కౌంట్ ఉండగా హోండా డబ్ల్యూఆర్‌వీ మోడల్ ను కొనుగోలు చేయడంపై 15 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్ తో పాటు 25 వేల రూపాయల క్యాష్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here