Honey Rose: 2008 లోనే హనీ రోజ్ తెలుగు సినిమాలలో నటించిన మీకు తెలుసా… మరి ఆ సినిమా ఏంటంటే?

0
437

Honey Rose: హనీరోజ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినపడుతున్న పేరు.మలయాళ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో సపోర్టింగ్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈమె బాలయ్యకు భార్యగా నటించి మెప్పించారు.

ఇలా హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు భార్యగా సందడి చేయడంతో ఎంతోమంది అభిమానులు అసలు ఈ హనీ రోజ్ ఎవరు ఈమె ఇదివరకే ఏదైనా తెలుగు సినిమాలలో నటించారా ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఈమె మలయాళం ఒక క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పేరు థామస్ తల్లి పేరు రోజ్ 1991 లో జన్మించిన హనీరోజ్ ఘటనపై ఆసక్తి ఉండడంతో 14 ఏళ్ల వయసులోనే ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇలా తమిళం మలయాళ సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు అయితే ఈమె తెలుగులో కూడా వీరసింహారెడ్డి సినిమా కన్నా ముందే పలు సినిమాలలో నటించారు. 2008వ సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఆలయం సినిమాలో నటుడు శివాజీతో కలిసి ఈమె ఆలయం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

Honey Rose: బాలయ్య తదుపరి చిత్రంలో అవకాశం అందుకున్న నటి..

ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో ఈమె సపోర్టింగ్ పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా హాని రోజ్ కిపెద్దగా గుర్తింపు తీసుకు రాలేకపోయింది అయితే మూడోసారి ఈమె బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించడంతో ఆ రెండు తెలుగు సినిమాలు తీసుకురాని గుర్తింపు వీర సింహారెడ్డి సినిమా ద్వారా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమాలో తన నటనతో మెప్పించిన హనీ రోజ్ బాలకృష్ణ తదుపరి చిత్రం అనిల్ రావిపూడి సినిమాలో కూడా ఈమెకు అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.