నోయిడా: నేటి ఆధునిక జీవనశైలిలో తల్లిదండ్రులు తమ పిల్లలను డే కేర్ సెంటర్లకు పంపిస్తున్నారు. అయితే, ఈ సెంటర్లలో చిన్నారులకు సరైన సంరక్షణ లభించడం లేదనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా, నోయిడాలో జరిగిన ఒక దారుణ ఘటన అందరినీ కలచివేసింది.

పనిమనిషి దారుణ హింస
ఆగస్టు 4న, నోయిడాలోని ఒక డే కేర్‌లో 15 నెలల బాలికపై జరిగిన హింస సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. పనిమనిషి ఏడుస్తున్న బాలికను శాంతింపజేయడానికి ప్రయత్నించి, ఆ తర్వాత సహనం కోల్పోయింది. నేలపై పడేసి, చెంపదెబ్బ కొట్టడం, కొరకడం, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొట్టడం వంటి దారుణ చర్యలకు పాల్పడింది. ఆ రోజు బాలికను ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత కూడా ఆమె ఏడుపు ఆగలేదు. బట్టలు మార్చే సమయంలో తల్లి, బాలిక రెండు తొడలపై వృత్తాకార గాయాల గుర్తులు గమనించింది. వైద్యుడిని సంప్రదించగా, ఆ గాయాలు మనిషి కరిచినవని నిర్ధారించారు.
పోలీసులకు ఫిర్యాదు, చర్యలు
దీంతో తల్లిదండ్రులు డే కేర్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో పనిమనిషి చేసిన హింసతో పాటు, చిన్నారి ఏడుస్తున్నప్పటికీ డే కేర్ అధిపతి ఎలాంటి చర్య తీసుకోకపోవడం గమనించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్-142 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, నిందితురాలైన పనిమనిషిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ, “ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నాం. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి” అని తెలిపారు.
ఈ సంఘటన డే కేర్ సెంటర్లలో పిల్లల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
पारस टेरा सोसाइटी नोएडा में नियमों को ताक पर रख कर संचालित ब्लीपी डे केअर की नाबालिक (16वर्ष)सहायिका द्वारा 15 माह की बच्ची (वेदांसी) के साथ मार पीट व मुह से काट कर घायल कर दिया गया
— kuldeep (@Kuldeep44816379) August 10, 2025
कृपया संज्ञान लें🙏 pic.twitter.com/MsQRMIM6uw































