బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. ఒకప్పుడు డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే.. క్యూలో నిల్చొని.. గంటలు గంటలు నిలబడి.. చివరికి పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సరికి చాలా సమయం పట్టేది. అంతే డబ్బుల తీసుకోవాలన్నా ఇదే ప్రాసెస్. తర్వాత రోజులు మారాయి. ఏటీఎం సెంటర్లు వచ్చాయి.

వాటి నుంచి మొదట సులభంగా డబ్బులను తీసుకునే వెసులుబాటును కల్పించాయి. తర్వాత ఏటీఎం మెషిన్లలో కూడా డిపాటిజ్ సౌకర్యాన్ని తీసుకొచ్చి.. బ్యాంక్ సేవలను వినియోగదారుడికి ఇంకాస్త దగ్గరగా తీసుకొచ్చాయి. ఇక మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో పెద్ద నోట్లను రద్దు చేసి..ఎక్కువగా డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపే విధంగా చేశాడు. అప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. దీనికి తోటు డిజిటల్ ప్లాట్ ఫాంలు అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక అకౌంట్ నుంచి డబ్బులను మరో అకౌంట్ ని ట్రాన్స్ ఫర్ చేయడం అనేది మరింత సులువు అయిపోయింది.
అయితే ఇలా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసే ఏ యాప్ కు అయినా సెక్యూరిటీ అనేది ఉంటుంది. కొంతమంది మొబైల్ లో పాస్ వర్ట్ పెడుతుంటే.. మరికొంతమది ఫింగర్ ఫ్రింట్.. మరికొంత మంది ఫేస్ రికగ్నైజ్ లాంటివి ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వల్ల కూడా సైబర్ నేరాలు చాలా జరిగాయి. ఇక పోతే తాజాగా జరిగిన ఘటనలో ఓ ప్రియురాలి.. ఫోన్ తీసుకున్న ప్రియుడు.. ఆమె మొబైల్ నుంచి దాదాపు రూ.18 లక్షలు కాజేశారు. ఇదెలా సాధ్యం అయిందంటే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె ఫోన్ తీసుకున్నాడు.
అందులో వివిధ రకాల యాప్ లను చెక్ చేస్తుండగా.. అందులో ఆమె బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన యాప్ ని ఓపెన్ చేయగా.. అందులో అమౌంట్ చూసి షాక్ అయ్యాడు. రూ.18లక్షలు అకౌంట్లో ఉండగా చూసి.. దానిని ఎలాగైనా కొట్టేయాలని ఆలోచించాడు. దానికి ఆ యాప్ ఓపెన్ చేసి.. ట్రాన్సాక్షన్ సమయంలో ఫేస్ రికగ్నైజ్ కు నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లి.. ముఖానికి ఎదురుగా ఫోన్ ఉంచాడు. తర్వాత ఆమె కనురెప్పలను పైకి ఉంచి లాక్ తీశాడు. ఆ అకౌంట్ నుంచి రూ.18లక్షలు కాజేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






























