టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా తన దైన శైలిలో నటిస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు.ఎన్టీఆర్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఈయన సినిమాలో తన నటనతో, తన డైలాగ్స్ తో, డాన్స్ తో ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన ఒక మార్క్ ను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. టాలీవుడ్లో స్టార్ హీరోలలో ఒకరిగా ఒక వెలుగు వెలుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు సీరియల్ లో నటించాడు అన్న విషయం చాలా మందికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సీరియల్ ఏంటో మనం తెలుసుకుందాం.

ఈయన సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఒక సీరియల్ నటించాడు. ఆ సీరియల్ పేరు భక్త మార్కండేయ. అయితే సీరియల్ గురించి, అలాగే సీరియల్లో ఎన్టీఆర్ నటించాడు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈటీవీ మొదలుపెట్టిన కొత్తలో ఈ సీరియల్ వచ్చింది. ఇందులో మార్కండేయునిగా ఎన్టీఆర్ నటించాడు. శివ భక్తుడిగా ఎన్టీఆర్ అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఇది జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై నటించడం కొత్తేమి కాదు. బిగ్ బాస్ షో తో ఎన్టీఆర్ హౌస్ట్ గా తన సత్తా చాటుకున్నారు. అలాగే ఎవరు మీరు కోటీశ్వరులు షో లో కూడా సందడి చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన భక్త మార్కండేయ సీరియల్లో అతని గెటప్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు వెండి తెరపై, ఇటు బుల్లితెరపై అలరిస్తూ దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.


































