RRR Movie Pramotions: దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. దీని విడుదల కోసం పంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు దీనికి జనవరి 7వ తేదీన విడుదల కావాల్సి ఉంది కానీ.. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండటంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

అయితే సినిమా విడుదలకు ప్రమోషన్ల కోసం పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోయింది. దాదాపు రూ.40 కోట్ల వరకు ప్రమోషన్ల కోసం ఖర్చు పెట్టారట. మొదట సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా కరోనా దెబ్బ ఈ సినిమాపై బాగా పడింది.

అప్పుడప్పుడు ఇలా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఎలాగోలా సినిమాను పూర్తి చేసేశారు. కానీ ఒమిక్రాన్ ప్రభావంతో ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడింది. 50 శాతం ఆక్యూపెన్సీతో విడుదల చేసుకోవచ్చు అని చెప్పినా.. నష్టం వస్తుందనే కారణంతో సినిమాను వాయిదా వేసుకున్నారు సినీ నిర్మాతలు. మరి సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే క్లారిటీ ఇప్పటి వరకు లేదు.
చిన్న సినిమాలకు ప్లస్ అనే చెప్పాలి..
ఇంత పెద్ద బడ్జెట్ సినిమా వాయిదా పడటంతో.. చిన్న సినిమాలకు ప్లస్ అనే చెప్పాలి. దాదాపు 6 నుంచి 8 సినిమాల వరకు ఈ సంక్రాంతికి బరిలో దిగనున్నాయి. ఇదంతా ఇలా ఉంటే.. ప్రమోషన్ల కోసం పెట్టిన ఖర్చు తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. చెన్నై, బెంగళూరు, కొచ్చి అంటూ అన్ని చోట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. వాటి కోసం దాదాపు రూ.40 కోట్లు ఖర్చు పెట్టామని సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు ట్విట్టర్ వేదిక గా చెప్పాడు. ఇప్పుడు ఇదంతా వృథాగా అయిపోయింది. ఇక మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ.. ఆ సమయంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
Breaking news- Film #RRR is postponed for indefinite time. While producers have already spent approx ₹40Cr on promotion till now.
— Umair Sandhu (@UmairSandu) January 1, 2022































