సాధారణంగా మనం తినే ఆహారాలు రుచికరంగా ఉన్నాయంటే అందులో తప్పకుండా ఉప్పు ఉండాల్సిందే. లేకుంటే ఆ వంటకు రుచే ఉండదు. మన ఆహారంలో తగినంత ఉప్పును చేర్చుకోవడం వల్ల ఆహారం రుచిగా ఉండటమే కాకుండా మన శరీరానికి కావలసిన సోడియం లవణాలను కూడా పొందవచ్చు. అంటే చాలామంది ఉప్పు ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను ఇష్టపడుతుంటారు. అయితే ఈ విధంగా రోజు అధిక మొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల ప్రాణానికే ప్రమాదం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది.

చాలామంది రోజువారీ ఆహారంలో భాగంగా అధిక మొత్తంలో ఉప్పును తింటూ ఉంటారు. ఈ విధంగా ఉప్పు అధిక మొత్తంలో తినటం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయని WHO తాజాగా తెలియజేశారు. అతిగా ఉప్పు తినడం వల్ల ప్రతి ఏటా సుమారు 30 లక్షల మంది ఈ విధమైనటువంటి వ్యాధులతో మరణిస్తున్నారని ఈ సందర్భంగా WHO తెలిపింది.
మన శరీరానికి తగినంత సోడియం ఉండాలంటే ప్రతి మనిషి రోజుకు కేవలం ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని, అంతకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని WHO తెలియజేసింది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు,ప్యాక్ చేసిన బ్రెడ్, స్నాక్స్, మాంసం ఉత్పత్తులు, చీజ్ వంటి ఆహార పదార్థాలలో తగినంత సోడియం కంటెంట్‌ను ఉపయోగించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రతి మనిషి రోజుకు ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 25 లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని
WHO పేర్కొంది. ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవడం ద్వారా మన శరీరానికి తగినంత సోడియం లభించి ఎంతో ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపడుతుంది.






























