బ్యాంకు రుణాలను మంజూరు చేయాలంటే సాధారణంగా సిబిల్ స్కోరును లెక్కిస్తారు. అలా వారి సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే రుణాలను మంజూరు చేస్తారు. లేదంటే.. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాగానీ వాళ్లకు రుణం మంజూరు కాదు. అంతటి ప్రాధాన్యత ఉంటుంది సిబిల్ స్కోర్ కు. అయితే ఎక్కవగా సిబిల్ స్కోర్ అనేది ‘0 నుంచి 1000’ మధ్య ఉంటుంది.

అందులో 800 కంటె ఎక్కువగా ఉంటే సేఫ్ గా ఉన్నట్లు. ఈ స్కోర్ అనేది మంచిది. 600 నుంచి 800 మధ్యలో ఉంటే.. కొద్దిగా రిస్క్ లో ఉన్నట్లు అంటే.. దానిని కవర్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. అయితే 550 కంటే తక్కువగా ఉంటే మాత్రం రుణాలను మంజూరు చేయడానికి ఏ బ్యాంకు ముందుకు రాదు.
అయితే కొన్ని సందర్భాల్లో రుణాలను మంజూరు చేసే అవకాశం ఉంది. అదెలా అంటే.. ఎక్కువ వడ్డీ రేటు వేసి.. తక్కువ కాలపరిమితితో.. తక్కువ అమౌంట్ ఇస్తారు. దీనిని మనం నెలవారీగా మళ్లీ ఈఎంఐ లాంటివి కడుతూ ఉంటే.. మళ్లీ సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉటుంది.
అయితే ఇలాంటి రుణాలు ఇవ్వాలంటే.. ఎలాంటి నిబంధనలు లేకుండా ఫిన్ టెక్ అనే సంస్థలు రుణాలను ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అందులో కొన్ని సంస్థలు కేవలం సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్లకు మాత్రమే రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. ఇలా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని బాధపడే వారికి.. ఇది ఒక శుభవార్త అనే చెప్పవచ్చు.



























