చెమటకాయలు నుంచి ఉపశమనం పొందాలంటే ఇవి పాటించాల్సిందే!

0
108

వేసవి కాలం రావడంతో వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో అధికంగా చెమట ఏర్పడుతుంది. చెమట ద్వారా ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కలిసి చెమట గ్రంధులను మూసివేస్తాయి. ఫలితంగా చెమట బయటకు వెలువడకుండా లోపలే ఉండిపోతుంది. ఈ చెమట గ్రంధులు ఒక్కసారిగా పగిలినప్పుడు అవి సూదులు వలె మనకు గుచ్చుకుంటూ ఉంటాయి.ఈ విధంగా వేసవిలో ఎంతో బాధిస్తున్న చెమటకాయల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని పద్ధతులను పాటించడంవల్ల వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 • బాగా గాలి తగిలేలా చూసుకోవాలి:
  వేసవి కాలంలో చెమట కాయలు నుంచి విముక్తి పొందాలంటే ఎక్కువగా మన బాడీని చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కడైతే చెమటకాయలు ఉంటాయో ఆ ప్రదేశంలో గాలి తగిలే విధంగా చేసుకోవడంతో పాటు, ఆ ప్రదేశంలో దుస్తులు పక్కకు తీసి చల్లగాలికి మన శరీరానికి తగిలేలా చూసుకోవాలి.
 • కాటన్ దుస్తులను ధరించడం:
  వేసవి కాలంలో మన శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులు, సింథటిక్ దుస్తులను వేసుకోవడం మానేయాలి. వీలైనంతవరకు లేత రంగులో ఉండే దుస్తులు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ఈ విధంగా కాటన్ దుస్తులను ధరించినప్పుడు మన శరీరానికి గాలి తగలడానికి కూడా వీలుగా ఉంటుంది.
 • ద్రావణాలు అధికంగా తీసుకోవడం:
  వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మనశరీరం తొందరగా డీహైడ్రేట్ అవుతుంది.కాబట్టి మన శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. అందుకోసం తరుచు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి నాచురల్ కూల్ డ్రింక్స్ తీసుకోవాలి. అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
 • చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి:
  వేడి వాతావరణంలో తరచూ మన చర్మం తడిగా ఉండే చెమట ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తద్వారా చర్మం మొత్తం ఎర్రబడటం దద్దుర్లు రావడం జరుగుతుంది.కనుక మన శరీరం ఎప్పుడు తడిగా కాకుండా పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. స్నానం చేసిన వెంటనే తడిని శుభ్రంగా తుడుచుకొని , కూల్ పౌడర్ వేసుకోవటం వల్ల చమట కాయల నుంచి విముక్తి పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here