సాదారణముగా చాలామంది అనుకుంటూ ఉంటారు.. బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే గాలి కాలుష్యం వల్ల మనం పీల్చే గాలి కలుషితం అవుతుంది అని. ఇంట్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎంచక్కా శుభ్రంగా మంచి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు అని అనుకుంటారు. అలా అని ఇంట్లో ఉన్నాగాని ఎదో ఒక ఆరోగ్య సమస్యలు, ఎలేర్జిలు వస్తూనే ఉంటాయి కదా.. ! కానీ ఎందుకని ఇలా అని ఎవరన్నా ఆలోచించారా.. అయితే మనం ఇరవై నాలుగు గంటలు మనం పీల్చే గాలి యొక్క క్వాలిటీ గురించి మాత్రం పట్టించుకోం.

అయితే మనకు తెలియని విషయం ఏంటంటే మనం పడుకునే పరుపుల దగ్గర నుండి పిల్లలు వేసుకునే డ్రెస్సుల వరకూ అన్నింటిలోనూ ఎన్నో విషపూరితమైన కెమికల్స్ ఉంటాయి. ఇలా టాక్సిన్స్ ఉన్న గాలిని పీల్చడం వల్ల రాషెస్, దగ్గు, కళ్ళల్లో ఇరిటేషన్, ఆస్థ్మా వంటి లక్షణాలు కనబడతాయి. అయితే మన ఇంట్లోనే మనకు తెలియకుండా ఎంతో కలుషితం అయిన గాలి ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో గాలిని సహజ పద్ధతుల్లో ఎలా ప్యూరిఫై చేయాలో చూద్దాం…!అయితే నాలుగు గోడల మధ్య ఉండే గాలి క్వాలిటీని అక్కడ ఉండే మాయిశ్చర్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగని ఇంట్లో ఉన్న కిటికీ లు పూర్తిగా తెరిచేస్తే గాలి మాట పక్కన పెడితే, బయట ఉన్న పొల్యూషన్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకే, ట్రికిల్ వెంట్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటే గాలి ప్యూరిఫై అవుతుంది.అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ యూజ్ చేయడం వల్ల కూడా లోపల ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి.అయితే వంట చేసేటప్పుడు, గ్యాస్ స్టవ్ మీద వండినప్పుడు వెలువడే నైట్రోజన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఆ గాలిని పీల్చడాన్ని హానికరం చేస్తాయి.

అలాగే, స్నానం చేసిన తరువాత కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తే లోపల ఉన్న తేమ, ఆవిరి బయటకు పోతాయి.అంతేకాకుండా మీ ఇంట్లో సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోవడం మంచిది. ప్యారఫిన్ క్యాండిల్స్ ను వీలయినంత ఎవాయిడ్ చేయండి, బీస్‌వాక్స్ క్యాండిల్స్ వెలిగించండి. ప్యారఫిన్ క్యాండిల్స్ వల్ల టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి చేసే మంచి కంటే చెడే ఎక్కువ. ప్యూర్ బీస్‌వాక్స్ క్యాండిల్స్ అసలు ఎలాంటి పొగ, వాసన లేకుండా వెలుగుతాయి. పైగా ఇవి చాలా సేపు వెలుగుతాయి. అలాగే మీ ఇంట్లో ఎవరన్నా అస్తమాతో ఇబ్బంది పడుతుంటే ఇవి ఎంతో హెల్ప్‌ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే, ఇవి గాలి లో నుండి దుమ్ము లాంటి ఎలర్జీ కి కారణమయ్యేవాటిని తొలగిస్తాయి. .

అలాగే ఇంట్లో హిమాలయన్ పింక్ సాల్ట్ లాంప్ ని మీ రూం లో లేదా ఆఫీస్ లో మీ డెస్క్ దగ్గర వెలిగిస్తే మీకు ప్యూర్ ఎయిర్ లబిస్తుంది, డెకరేషన్ లా కూడా ఉంటుంది. మీ రూమ్ లో రాత్రంతా వెలిగించినా కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. దీన్నించి వచ్చే ఆరెంజ్ గ్లో నిద్రని పాడు చేయదు. అలాగే నాలుగు గోడల మధ్య ఎయిర్ క్వాలిటీని పెంచడానికి యాక్టివేటెడ్ చార్‌కోల్ అద్భుతంగా పని చేస్తుంది. దీన్నే యాక్టివ్ కార్బన్ అని కూడా అంటారు. దీనికి ఎలాంటి వాసనా ఉండదు, గాలిలో నుండి హానికారకాలను రిమూవ్ చేయడం లో ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇంకో మంచి పద్ధతి ఏంటంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం ద్వారా కూడా మీరు గాలిని ప్యూరిఫై చేయవచ్చు. పచ్చని చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ కాలుష్యం ఉండదు. అందుకనే ఇంట్లో పెరిగే మొక్కలను పెంచండి. పీస్ లిల్లీ అనే మొక్కకి మధ్యస్తం గా ఉండే సూర్యరశ్మి కావాలి, లేడీ పామ్, లేదా బ్రాడ్‌లీఫ్ లేడీ పామ్ కి బ్రైట్, ఇన్‌డైరెక్ట్ లైట్ కావాలి. ఇంగ్లీష్ ఐవీ ని కంప్యూటర్స్ ఉన్న రూం లో పెంచుకోవచ్చు. గ్యాస్ స్టవ్స్ ఉన్న కిచెన్ లో స్పైడర్ ప్లాంట్ ని పెంచుకుంటే కార్బన్ మోనాక్సైడ్, జైలీన్ వంటి టాక్సిన్స్ కంట్రోల్ అవుతాయి..చూసారు కదా ఇంకా ఆలస్యం చేయకుండా పైన పద్ధతులు పాటించి మీ ఇంటిని, ఒంటిని ఆరోగ్యంగా ఉంచుకోండి.. !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here