Hrithik Roshan: హ్యాపీ బర్త్ డే తారక్… యుద్ధభూమిలో నీకోసమే ఎదురు చూస్తున్నా: హృతిక్ రోషన్

0
21

Hrithik Roshan:టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈయనకు సినిమా సెలబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అంచలంచలు ఎదుగుతూ గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తారక్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో హృతిక్ రోషన్ ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హ్యాపీ బర్త్ డే తారక్. ఈ సంతోషకరమైన రోజున నువ్వు ఎంతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తున్నాను. మనిద్దరం కలిసే వరకు నువ్వు ప్రశాంతంగా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా అంటూ ఈయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇలా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వార్ 2 లో ఎన్టీఆర్ నటించబోతున్నారంటూ ఈ సందర్భంగా హృతిక్ రోషన్ క్లారిటీ ఇచ్చేశారు. యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఈయన పరోక్షంగా వార్ 2 గురించి క్లారిటీ ఇచ్చారని అర్థమవుతుంది.

Hrithik Roshan: పరోక్షంగా ప్రకటించిన హృతిక్…


ఎన్టీఆర్ RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈయనకు బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ వార్ 2సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నప్పటికీ ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేదు కానీ హృతిక్ రోషన్ నేడు తారక పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.