బాలీవుడ్ నటి పూనమ్ పాండే తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి తన భర్త సామ్ బాంబే గురించి వార్తల్లో నిలిచారు. పూనమ్ పాండే, సామ్ బాంబే రెండు సంవత్సరాలుగా సహజీవనం చేసిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే సామ్ బాంబేకి వివాహం జరిగింది. ఈ క్రమంలోనే నటి పూనమ్ అతనితో సహజీవనం చేసి తనని రెండో పెళ్లి చేసుకుంది.

పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎన్నో మనస్పర్ధలు రావడం వల్ల తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే ఒకసారి సామ్ తన పై చేయి చేసుకోగా పూనమ్ అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికి తను క్షమాపణ చెప్పడంతో కేసు వెనక్కి తీసుకున్న పూనమ్ ఆ తరువాత ప్రతిసారి వీరిద్దరి మధ్య ఏదో ఒక విషయం గురించి గొడవలు మొదలయ్యాయి.
తాజాగా సామ్ బాంబే నటి పూనమ్ నుజుట్టు పట్టుకొని తన మొహం మొత్తం రక్తస్రావాలు అయ్యేవిధంగా ఎంతో దారుణంగా ఆమెను చితకబాదాడు. ఈ క్రమంలోనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు తనను అరెస్టు చేశారు. అధిక రక్తస్రావంతో బాధపడుతున్న నటిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే సామ్ తన పై చేయి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
సామ్ బాంబే తన మొదటి భార్య అల్వీరాతో తరచూ ఫోన్ మాట్లాడుతూ ఉండేది. ఈ విషయం నచ్చని పూనమ్ తరచూ తన భర్తతో గొడవ పడేది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతో విసుగుచెందిన సామ్ ఏకంగా తన జుట్టు పట్టుకొని తన పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇలా తనపై దాడి జరగగానే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం సామ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

































