భార్య లావుగా ఉందని.. భర్త ఆమెను వద్దు అన్నాడు.. చివరకు ఇలా జరిగింది..!

0
284

ఎవరైనా బరువు పెరగడానికి కారణాలు అనేవి చాలా ఉంటాయి. ఇష్టం వచ్చిన ఆహారం తింటే బరువు కచ్చితంగా పెరుగుతారు. శరీరంలో కొవ్వు తయారై పొట్ట సాగి బరువుగా తయారు అవుతుంది. కొంతమంది ఎలాంటి ఆహార పదర్థాలు తినకపోయినా లావు పెరుగుతారు. దీనికి గల కారణం జన్యుపరమైంది. ఇక్కడ మనం చెప్పుకునే మహిళకు అలాగే జరిగింది.

గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ కి సమస్య వల్ల ఆమె విపరీతంగా బరువు పెరిగింది. వివాహం జరిగినప్పుడు సన్నగా ఉన్నఆమె తర్వాత ఇలా లావుగా అవ్వడం తన భర్తకు ఇష్టం లేదు. దీంతో ఆమెను వదిలించుకునేందుకు కుట్రలు చేస్తున్నాడు. ఈ వ్యవహారాలన్ని గమనించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటన గుజరాత్ .. అహ్మదాబాద్‌ పట్టణంలోని మేమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు వెళ్తే.. ఆమెకు 2005లో పెళ్లి అయింది. 2010లో ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2014లో ఆమెకు రెండో సంతానంగా మగపిల్లాడు పుట్టాడు. ఇద్దరు పిల్లల తర్వాత ఆమెకు థైరాయిడ్ సమస్య వచ్చింది.

క్రమంగా బరువు పెరుగుతుండటంతో కోపం తెచ్చుకునే వాడు. ఇది థైరాయిడ్ సమస్య కారణంగా లావు పెరుగుతున్నాను.. నన్నేం చెయ్యమంటావ్ అంటూ ఆమె అతడికి బదులు సమాధానం కూడా ఇచ్చింది. అయినా అతడు వినలేదు. రోజురోజూకూ ఆమెపై చిరాకు పెంచుకునేవాడు. ఒకవేళ బయటకు వెళ్తే పిల్లలను తీసుకెళ్లేవాడు కానీ.. ఆమెను తీసుకెళ్లేవాడు కాదు.

అకౌంటెంటుగా ఉద్యోగం చేసే ఆమెను బలవంతంగా ఉద్యోగం మాన్పించేశాడు. చాలా బాధపడిన ఆమె సన్నగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఉపవాసం ఉంటూ.. పండ్లను తినమని డాక్టర్లు సలహా ఇస్తే.. నువ్వు అన్నం మానేసి పండ్లను తింటే రోజూ అంత ఖర్చు పెట్టి తేవాలా.. అంటూ భర్త ఆమెపై కోపం పెంచుకునే వాడు. ఇలాంటి శాడిజం బాధలు భరించలేక ఓ రోజు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తన భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చారు.