మద్యానికి బానిసైన వ్యక్తి రోజు మద్యం కోసం డబ్బులు కావాలని తన భార్యను తీవ్ర చిత్రహింసలకు గురి చేసే వాడు. ఈ క్రమంలోనే ప్రతి రోజు వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే వారికి రైతుబంధు డబ్బులు రావడంతో వాటిని ఇవ్వాలని గొడవ పడ్డాడు.అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి భార్య ఒప్పుకోకపోవడంతో ఏకంగా అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆమెపై గొడ్డలితో దాడి చేసి చంపిన ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

చందాపూర్ గ్రామానికి చెందిన సత్యమ్మ 45 రాములు పంతులకు ముగ్గురు మగ పిల్లలు ,ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. భార్యభర్తలిద్దరు వ్యవసాయ పనులు చూసుకుంటూ కూలి పనులకు వెళ్ళేవారు. అదేవిధంగా తన పెద్ద కుమారుడు అనంతపురం జిల్లాలో వరి కోత మిషన్ డ్రైవర్ గా పని చేస్తున్నారు.
గత కొంతకాలం నుంచి రాములు మద్యానికి బానిస అయ్యి ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే తనకు మరింత డబ్బు కావాలని తన భార్యతో గొడవ పడేవాడు. తన పెద్ద కుమారుడు పంపించే డబ్బులతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన సత్యమ్మ ఆ డబ్బులు తనకు కావాలని ప్రతి రోజు భార్యతో గొడవ పెట్టుకునేవాడు. అదే విధంగా తమకు ఉన్న మూడు ఎకరాల పొలానికి రైతుబంధు డబ్బులు కూడా పడటంతో ఆ డబ్బులు ఇవ్వాలని ఆమెతో గొడవకు దిగాడు.
రైతుబంధు డబ్బులు ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించాలని తనకు ఇవ్వనని భార్య చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రాములు ఫుల్లుగా మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి చేరుకొని తన భార్య గాఢంగా నిద్రిస్తున్న సమయంలో తనపై గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. ఈ విధంగా గొడ్డలితో ఆమె పై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
భార్యను చంపిన రాములు మద్యం మత్తులో తెల్లవార్లు అక్కడే కూర్చుని ఉన్నాడు.ఉదయానికి మద్యం మత్తు దిగగానే తన భార్యను తానే చంపానని తను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నానని పరుగులు పెట్టడంతో స్థానికులు అడ్డగించి ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి అతనిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు.































