చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నకు సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద ఈ నోటిసులు ఇచ్చారు. బుధవారం రోజు కూడా క్యూ న్యూస్ ఆఫీస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 12 హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీశీలన కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు. వీటి ఫలితాల అనంతరం వాటి వివరాలను నివేదికలో పోందుపరిచి న్యాయస్థానానికి అందజేస్తారు.

తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంలో మంగళవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్నపై ప్రియాంక అనే యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.































