భర్తతో చిన్నచిన్న గొడవలు చోటుచేసుకున్నాయి. వారిద్దరిది ప్రేమ వివాహం. ఆ రోజు ఆమె భర్తతో చిన్న గొడవపడింది. క్షణికావేశంలో అతడిపై కోపంతో ఆత్మహత్యకు సిద్ధమైంది. దానికి మొదట ఆమె దేవుడికి పూజ చేయడానికి సిద్దపడింది. హరతిని ఇచ్చే క్రమంలో హారతి ఆరిపోయింది. నదుట మీద కుంకుమతో బొట్టు పెట్టుకునే ప్రయత్నంచేసింది.

కానీ అక్కడ కుంకుమ భరణి మొత్తం కిందపడిపోయింది. ఇవి అపశకునాలేనని.. తన ఆయుష్షు తీరిందని ఆమె భావించింది. అంతే.. సెల్ఫీ వీడియో తీసుకొని తనువు చాలించింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్, కబితలు 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నారు.
వీరు జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 78 సమీపంలోని అంబేడ్కర్ నగర్‌లో ఓ ఇంటి మూడో అంతస్తులో నివసిస్తున్నారు. వీరికి ఒక అమ్మాయి ఉంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓంప్రకాశ్ తన కూతురును తీసుకొని వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. తన భార్య ఫ్యాన్ ఉరేసుకొని మరణించడం చూసి అతడు తట్టుకోలేకపోయాడు.
అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని విచారించగా చిన్నపాటి గొడవ మాత్రమే జరిగిందని తెలిపారు. ఆమె ఫోన్ ను పరిశీలించగా సెల్ఫీ వీడియో ద్వారా కారణాన్ని తెలుసుకున్నారు. దీంతో ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


























