Hyper Aadi-Anchor Ansuya: ‘జబర్దస్త్’ షో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరలో అత్యంత ప్రాచుర్యం పొందిన షో. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు జబర్దస్త్ చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

దీనికి తగ్గట్లుగానే బబర్థస్త్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ షోకు భారీగా టిఆర్పి రేటింగులు కూడా వస్తున్నాయి. ఇక ఇది పక్కన ఉంచితే యాంకర్లు అనసూయ, రష్మీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. టీమ్ ఫెర్ఫామెన్స్ ఒకెత్తు అయితే.. యాంకర్ల గ్లామర్ మరో ఎత్తు.

ఇక యాంకర్లతో టీమ్ లీడర్ల కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. జబర్థస్త్ తో అనసూయ- హైపర్ ఆది, ఎక్ట్రా జబర్థస్త్ లో రష్మీ- సుడిగాలి సుధీర్ ల మధ్య ఫన్నీ సన్నివేశాలు, సెటైర్లు షోకే హైలెట్ గా నిలుస్తాయి.
పుష్ప రాజ్ గా హైపర్ ఆది రచ్చ రచ్చ..
తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ అనసూయ, హైపర్ ఆది జోడి ఇప్పుడు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలగజేస్తుంది. జబర్దస్త్ ప్రోమో లో కూడా హైపర్ ఆది రెచ్చిపోయాడు. తనదైన శైలిలో యాంకర్ అనసూయ పైన పంచులు వేశాడు. పుష్ప సినిమాను జబర్దస్త్ స్కిట్ లో చేశాడు. ఈ స్కిట్ షోకే హైలెట్గా నిలిచింది. పుష్ప రాజ్ గా హైపర్ ఆది రచ్చ చేశాడు. అనసూయ ఉద్దేశిస్తూ.. పలు కామెంట్ కూడా చేశాడు. అచ్చం పుష్పరాజ్ హావభావాలతో అనసూయ చూస్తూ.. అనసూయ నన్ను లవ్ చేస్తుందని నాకు తెలుసు రా ..అంటూ పుష్ప సీన్ రీ క్రియేట్ చేశాడు ఆది. దీనికి అనసూయ కూడా సిగ్గుపడు పోవడం షోకే హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. జనవరి 20వ తేదీన ఇందుకు సంబంధించి ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.