అంతా తూచ్ హైపర్ ఆది నా లవర్ కాదు… కేవలం రేటింగ్ కోసమే… !!

0
507

హైపర్ ఆది జబర్దస్ కమిడియన్ గా అయన పంచ్ లకు ఉన్న క్రేజే వేరు… యాంకర్, జడ్జి అంటూ ఎవరిని వదలకుండా పంచ్ లు వేయడంలో దిట్ట హైపర్ ఆది. అదే జోష్ తో కొన్ని సినిమాలలో కూడా అవకాశాలు కొట్టేసాడు. మరో పక్క ఢీ షోతో యాంకర్ గా కూడా తన సత్తా నిరూపించుకుంటున్నాడు. ఇదే క్రమంలో యాంకర్ వర్షిణితో కలిసి బుల్లితెరపై రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నాడు. ఢీ ప్రోగ్రాంలో యాంకర్ వర్షిణితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తూ తనలోని రొమాంటిక్ టాలెంట్ ని కూడా బయటకి తీస్తున్నాడు.

డాన్స్ పెరఫార్మన్స్ లు, రొమాంటిక్ స్కిట్లతో ఈ షోకి మంచి టిఆర్పి రేటింగ్స్ తీసుకొస్తున్నాడు. అయితే ఈ మధ్య వీరిద్దరిపై రూమర్స్ ఎక్కువయ్యాయి. హైపర్ ఆది – వర్షిణి మధ్య ఏదోనాడుస్తోందటూ… వీరిద్దరూ మంచి ప్రేమలో మునిగితేలుతున్నారని అందుకే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడుస్తుందని టాక్ మొదలైంది.

దీనితో హైపర్ అది, ఇటు వర్షిణి వీరిద్దరూ ఎక్కడ కనిపించినా ఇదే విషయం అడిగేస్తున్నారట. తాజాగా యాంకర్ వర్షిణి ఆన్లైన్ లైవ్ చేసింది. ఈ క్రమంలో లైవ్ చాట్ లో ఒక నెటిజన్ ఇటువంటి ప్రశ్న వేసాడు. దీనిపై వర్షిణి స్పందిస్తూ తమ ఇద్దరి మధ్య అటువంటిది ఏమిలేదని, హైపర్ ఆది తనకు మంచి స్నేహితుడని చెప్పింది. అదే సమయంలో సుడిగాలి సుధీర్ కూడా తనకు ఫ్యామిలీ మెంబెర్ లాంటివాడని తెలిపింది. అయితే గతంలో హైపర్ ఆది ఈ వార్తలపై స్పందించాడు. అదంతా మేము ఢీ ఛాంపియన్స్ షో కోసం మాత్రమే చేస్తున్నామని, మేము చేసే రొమాన్స్ కేవలం రెంటింగ్ కోసమేనని స్పష్టం చేసాడు.