విలన్ పాత్రలో ఎంతో మందని మెప్పించి ఎందరో ప్రముఖ హీరోలతో నటించిన గొప్ప నటుడు బెనర్జీ. ఆయన అసలు పేరు మాగంటి వేణు బెనర్జీ. ఆయన 30 ఏళ్ళకు పైగా చిత్ర పరిశ్రమలో అనుభవం ఉన్న బెనర్జీ.. సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి, అనంతరం సహాయ పాత్రలలో, విలన్‌గా నటించారు.

ఇక పోతే హలో బ్రదర్ తర్వాత అక్కినేని నాగార్జున తన పరిస్థితి చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని బెనర్జీ అన్నారు. ఒకవేళ చెయ్యాలని గట్టిగా అనుకుంటే చేసేవాడినేమోగానీ, చేయకుండా అలా వదిలేశానని, తానే చేయొద్దు అనుకున్నానని ఆయన చెప్పారు.
ఇక రామ్ గోపాల్ వర్మ, తేజ లాంటి ప్రముఖ డైరెక్టర్స్ తో చేసిన ఆయన ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించట్లేదు. దానికి ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆ సినిమాకి నేను సూట్ అవుతానని అనుకున్నారు. అందుకే తీసుకున్నారు. అలాగే ఇప్పుడు కొన్ని సినిమాల్లో వేరే వాళ్ళు సూట్ అవుతారని వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. అలా మళ్ళీ నేను దేనికి పనికి వస్తాను అనుకుంటే మళ్ళీ అవకాశాలు వస్తాయి అంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇలా బెనర్జీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో అద్భుతమైన సినిమాలలోనటించి మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం అయితే అతనికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవని, అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు.






























