విజయవంతంగా సాగిన ‘కన్నప్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, తన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. యాంకర్ సుమ అడిగిన ఓ సింపుల్ ప్రశ్న – “మోహన్ బాబులో మీకు నచ్చే విషయం ఏంటి? నచ్చని విషయం ఏంటి?” అన్నదానికీ బ్రహ్మానందం ఇచ్చిన సమాధానం అందరికీ షాకిచ్చేలా మారింది.

బ్రహ్మానందం ఏమన్నారుంటే, “నచ్చింది లేదు.. నచ్చనిది లేదు.. మోహన్ బాబు నాకు అస్సలు నచ్చడు!” అంటూ ఖచ్చితంగా చెప్పేశారు. ఈ మాట వినగానే సుమతో పాటు వేదికపై ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే సుమ “ఎందుకండీ?” అని అడిగినపుడు, బ్రహ్మీ తనదైన సెటైరిక్ స్టైల్‌లో “ఆన్సర్ చెప్పాను కదా… ఇప్పుడు కారణాలూ చెప్పాలా నీకు?” అని మరోసారి అందరిని ఆశ్చర్యపరిచారు.
అయితే దీనికి స్పందనగా మైక్ అందుకున్న మోహన్ బాబు మాత్రం చాలా బాగా స్పందించారు. “బ్రహ్మానందం ఏం చెప్పినా కరెక్ట్. అతన్ని నేను ఏమీ అనలేను. ఐ లవ్ హిమ్” అంటూ నవ్వుతూ మేటి డిప్లొమసీ చూపారు. ఆ తరువాత బ్రహ్మానందం మళ్లీ స్టేజ్ పైకి వచ్చి, తన వ్యాఖ్యల వెనక ఉన్న అనుబంధాన్ని స్పష్టంచేశారు. “మోహన్ బాబుతో నాకు ఉన్న చనువు అలాంటిది. అందుకే నేను అలా అన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇంకా బ్రహ్మానందం మాట్లాడుతూ, “మోహన్ బాబు సినిమాలు, నటన నచ్చకపోతే మీరు ట్రోల్ చేయండి. కానీ ‘కన్నప్ప’ సినిమాను మాత్రం ఆదరించండి. శివునిపై సినిమా తీయడానికి ఆయన రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు. సాధారణంగా ఆయన రూ.10 కోట్లు కూడా పెట్టరు” అని అన్నారు. ఈ కామెంట్స్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాకు మోహన్ బాబు అంటే అసలు ఇష్టం లేదు.
— greatandhra (@greatandhranews) June 21, 2025
అసెంబ్లీ రౌడీ సినిమా నేను చేయాల్సింది.. మోహన్ బాబు మా ఇంటికి వచ్చి అడిగితే ఇచ్చేశా – #Brahmanandam#Kanappa #MohanBabu pic.twitter.com/VFooI21orW
సుమ ప్రసన్నత, బ్రహ్మీ సెటైర్లు, మోహన్ బాబు కూల్ స్పందన – ఈ అన్నీ కలిసొచ్చి ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి.

































