అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు‘ రేపు (జూలై 24) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

లోకేశ్ ట్వీట్: “పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఘన విజయం సాధించాలి”
“మా పవన్ అన్న సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదల సందర్భంగా సినీ నిర్మాణంలో పాల్గొన్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ ఈ సినిమాను ఎంతో ఆతృతిగా ఎదురుచూస్తున్నాను. పవన్ అన్న నటన, ఆయన స్వాగ్ నాకు చాలా ఇష్టం. పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘హరిహర వీరమల్లు’పై అంచనాలు
‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు సినిమా విడుదల కానుండగా, నేటి రాత్రి నుంచే పలుచోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో… pic.twitter.com/NP9rw3eZkR
— Lokesh Nara (@naralokesh) July 23, 2025




























