Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈ నెల 29 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మెగాస్టార్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1988 లో రుద్రవీణ సినిమా చేసినందుకు తనకు నేషనల్ ఇంటెగ్రిటీ అనే అవార్డు వచ్చింది. ఆ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాలి. అయితే అవార్డు తీసుకోవడానికి ముందు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తేనీటి విందు ఇస్తారు. అలా టీ తాగుతూ ఉన్న సమయంలో అక్కడ గోడపై బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలబ్రెటీలు ఫోటోలు ఉన్నాయి.

ఆ ఫోటోలు చూడగానే చాలా సంతోషం వేసింది. అయితే సౌత్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు విషయానికొస్తే కేవలం ఎంజిఆర్, జయలలిత ఫోటోలు మాత్రమే ఉన్నాయి. తెలుగులో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్, విష్ణువర్ధన్ వంటి ఎంతోమంది గొప్ప నటులు ఉన్నప్పటికీ వారి ఫోటోలు ఎక్కడ లేకపోవడంతో చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమేనా..ప్రాంతీయ భాషా చిత్రాలకు ఎలాంటి గౌరవం ఇవ్వకపోవడంతో చాలా బాధగా అనిపించిందని చిరంజీవి వెల్లడించారు.
రాజమౌళి పీఠాధిపతి…
ఆ రోజు బాధ పడినప్పటికీ నేడు ఎంతగానో గర్విస్తున్నాను. నేను గర్వపడేలా తెలుగు సినిమా క్యాతి హద్దులు దాటి, ఎల్లలు చెరిపేసి ఇండియన్ సినిమా అని గర్వపడేలా బాహుబలి, బాహుబలి 2,RRR సినిమాలు చేశాయి. ఇలాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి మన టెక్నీషియన్ కావడం ఎంతో గర్వకారణం. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి అంటూ మెగాస్టార్ చిరంజీవి రాజమౌళి గురించి తెలుగు సినిమాల గురించి ఎంతో గర్వంగా తెలియజేశారు.ప్రస్తుతం తెలుగు సినిమాల గురించి రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.































