సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉందట మోడ్రన్ మదర్ రోల్స్ చేసే ఆర్టిస్ట్ సురేఖా వాణి కి. ఏది ఏమైనా ఏజ్ బార్ లో కూడా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ బోల్డ్ కామెంట్స్ కి కేరాఫ్ అడ్రస్‌ గా నిలుస్తోంది. తాజాగా ఆమె చేసిన ముద్దుల కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.తాజాగా సురేఖా వాణి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇస్తే ఇచ్చింది, హోస్ట్‌ అడిగిన ఓ దిగువ స్థాయి ప్రశ్నకు, అంతే దిగజారిపోయి సమాధానం చెప్పింది.

ఇంతకీ ప్రశ్న ఏమిటంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలి అంటే, మీరు ఎవరికి అన్ని ముద్దులు ఇస్తారు ? అని ఆ యాంకర్ అడిగాడు. సహజంగా ఆంటీ వయసులో ఉన్న నటిని ఇలాంటి ప్రశ్నలు అడగడమే ఆశ్చర్యం అనుకుంటే..ఆ ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా పైగా ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ గా వంద ముద్దులు ఇవ్వాలి అంటే ‘పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌’కి ఇచ్చేస్తా అని చెప్పింది సురేఖా వాణి.

ఈ మధ్య సురేఖా వాణి తరచూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కూతురితో కలిసి హాట్ హాట్ ఫోజులతో వైరల్ అవుతూనే.. ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఇక పనిలో పనిగా సురేఖ వాణి తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనలను కూడా ప్రేక్షకులతో పంచుకుంది. సురేఖా వాణి భర్త చనిపోయాక, అత్తింటివారు చాల ఇబ్బంది పెట్టారట. వారి వేధింపులకు తట్టుకోలేక తానూ ఆ ఇంటి నుండి బయటకు వచ్చానంటూ సురేఖా వాణి ఎమోషనల్ అయింది.

ప్రస్తుతం ఆమె రెండో పెళ్లి గురించి కూడా వార్తలు వస్తుండటంతో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చింది.తనకు ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు అని, ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. బాగా డబ్బు ఉన్నవాడు భర్తగా కావాలి అని చక్కగా సిగ్గు పడుతూ ఎంతో పద్దతిగా చెప్పింది ఈ పతివ్రతా శిరోమణి. ఇక ఈమెకు హీరోల్లో చిరంజీవి అంటే బాగా ఇష్టం అట. మెగాస్టార్ కి పెద్ద అభిమానిని అని, చిరును చూసినప్పుడల్లా తన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పుకొచ్చింది సురేఖా…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here