Mahesh: మహేష్ ఆచంట పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్థస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గా పలు కీలక పాత్రలు చేస్తున్నాడు. తన దైన డైలాగ్ డెలవరీతో, గోదావరి యాసతో పేక్షకులకు దగ్గయ్యాడు. జబర్థస్త్ లో పరిచయం అయిన మహేష్ ఆచంట.. సినిమాల్లో చిన్నచిన్న వేషాల దగ్గర నుంచి ప్రధాన పాత్రలు పోషించే స్థాయికి ఎదిగాడు.

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పక్కన కనిపించారు. ఆసినిమాలో రామ్ చరణ్ చెవుడు క్యారెక్టర్ కావడంతో ఆయనకు ఇతరు మాట్లాడిన మాటలను వినిపించే పాత్రను పోషించారు. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా రూపొందిస్తున్న అర్జుణ ఫాల్గుణ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్లలో మహేష్ ఆచంట షాకింగ్ కామెంట్స్ చేశాడు. మహానటి సినిమానే నాకు చివరి సినిమా అవుతుందని తాను చాలా భయపడినట్లు మహేష్ ఆచంట చెప్పుకొచ్చారు.
ఆ క్యారెక్టర్ మంచి గుర్తింపు తెచ్చింది.. మహేష్
మహానటి సినిమాలో సావిత్రిని మోసం చేసే సత్యం పాత్రలో మహేష్ ఆచంట కనిపించాడు. ఈ క్యారెక్టర్ తనకు మంచి గుర్తింపు ఇచ్చిందన్నాడు. ఈ చిత్రం విడుదలైన తర్వాత మా ఊరు వెళ్లితే అక్కడ నన్నంతా తిట్టారని..నీకేం పోయేకాలం సావిత్రిని మోసం చేశావంటూ తిట్టారని.. మరికొంత మంది రాళ్లతో కొడుతారేమో అని భయం వేసిందన్నారు. ప్రేక్షకులు ఈ క్యారెక్టర్ కు అంతగా కనెక్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు. అర్జుణ పాల్గుణ చిత్రం కూడా తనకు అలాంటి గుర్తింపే ఇస్తుందని మహేష్ ఆచంట చెప్పుకొచ్చారు.






























