KCR Biopic: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత వర్మకి ఉందని చెప్పాలి. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన బాలీవుడ్ సినిమాలు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈయన దృష్టి సినిమాలపై కాకుండా వివాదాల వైపు మళ్ళింది.ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా లేదా వివాదాస్పద సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారు.

ఇకపోతే రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా రాజకీయ నాయకుల జీవితచరిత్రలు తెరకెక్కించడం అలవాటుగా మారింది.ఈ క్రమంలోనే గతంలో అనంతపురంలో ఫ్యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరి జీవిత చరిత్ర ఆధారంగా రక్త చరిత్ర అనే సినిమా చేశారు.ఇక ప్రస్తుతం కొండ మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా కొండా సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా జూన్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో తాజాగా సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు. తమ తల్లిదండ్రుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మిత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇకపోతే ట్రైలర్ లాంచ్ కార్యక్రమం లో భాగంగా వర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
నిజాలను మాత్రమే తెలియజేస్తా…
కొండా సురేఖ మురళి దంపతుల జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. అయితే వాటన్నింటిని సినిమాలు చూపించడం కుదరలేదని వర్మ తెలిపారు. తాను త్వరలోనే మరొక బయోపిక్ చిత్రం ద్వారా మీ ముందుకు వస్తానని చెప్పారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నానని అయితే ఎప్పుడు చేస్తానో మాత్రం తెలియదు అని వెల్లడించారు.ఇక తాను బయోపిక్ చిత్రం చేస్తే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించనని అన్నీ వాస్తవాలే ఉంటాయని తెలిపారు.



























