టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం పుష్పక విమానం. ఇందులో గీత్ సైని, శాన్వి మేఘ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను నూతన దర్శకుడు దామోదర దర్శకత్వం వహించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి సిద్దమవుతోంది. రేపు నెల నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లు పుష్పక విమానం సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా సిడేడ్ లో ఈ సినిమాను విడుదల చేస్తుండగా, నైజాం లో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో ప్లీజ్ ప్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, అలాగే రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇక ఈ నెల 30న పుష్పక విమానం ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రాబోతున్నారని,ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు చిత్రబృందం.
Bigg AAnnouncement!#PushpakaVimanam Trailer..@ananddeverkonda @itsdamodara @SaanveMegghana @tanga_official @GeethSaini @adityamusic @KingofHillEnt pic.twitter.com/jx1Zlq8fge
— Vijay Deverakonda (@TheDeverakonda) October 28, 2021
ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి థాంక్స్ చెబుతూ ఒక పోస్ట్ చేశారు. ఇటీవలే విజయ్ దేవరకొండ పుష్పకవిమానం సినిమాకు చేస్తున్న ప్రమోషన్స్ తో ఈ సినిమా ఆడియన్స్ కు బాగా రీచ్ అవుతోంది. ఈ సినిమాకు గోవర్ధనరావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.






























