ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందాలనుకునే కస్టమర్లకు ఐడీబీఐ బ్యాంక్ ఓ సరికొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ బ్యాంక్ తమ కస్టమర్లకు ఎన్నోరకాల సర్వీసులను అందిస్తుంది. వీటిలో ప్రత్యేకమైన పథకాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎస్ఎస్‌పీ ప్లస్ అనే ఒక పథకం ఉంది. ఈ పథకం ద్వారా కస్టమర్లు రెగ్యులర్ గా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందవచ్చని తాజాగా బ్యాంకు యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఈ బ్యాంకు కస్టమర్లు ప్రతినెల తమకు నచ్చిన మొత్తాన్ని
ఐడీబీఐ సిస్టమ్యాటిక్ సేవింగ్స్ ప్లాన్ ద్వారా జమ చేసుకోవచ్చు. ప్రతి నెల మనం ఎంత మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలని భావిస్తామో అంత మొత్తాన్ని ప్రతినెల మన అకౌంట్ నుంచి కట్ అవుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు.
ఈ బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్న ఎస్ఎస్‌పీ ప్లస్ స్కీమ్ వల్ల డబ్బులతో పాటు ఆ డబ్బుకు వడ్డీని కూడా పొందవచ్చు. అదేవిధంగా ఐదు లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా బ్యాంక్ తమ కస్టమర్లకు అందిస్తోంది. అయితే ఈ పథకం ద్వారా ఒక ఏడాది నుంచి పదేళ్ల వరకు డబ్బులను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ప్రతి నెల వంద రూపాయల నుంచి డిపాజిట్ పొందవచ్చు. ఈ పథకంలో డబ్బులను జమ చేసే కస్టమర్లు ప్రతి నెల బ్యాంకు వెళ్ళే పని లేకుండా తమ కస్టమర్లకు నెట్ బ్యాంకింగ్ లేదా గో మొబైల్ ప్లస్ యాప్ ద్వారా ఎస్ఎస్‌పీ ప్లస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.






























